
టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉన్న హీరోయిన్లలో రష్మీక కూడా ఉంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే కన్నడ భామ రష్మీక చేతిలో మహేష్ తో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా, నితిన్ తో 'బిష్మ', అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో నిమిషం తీరిక లేకుండా గడిపేస్తుంది. అసలు సంగతి ఏంటంటే....ప్రస్తుతం పరుశురాం నాగచైతన్యతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అసలైతే అనుకున్న ప్రకారం గీత గోవిందం తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. మహేష్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని పరుశురాం చెప్పిన కథకు మహేష్ ఇంప్రెస్ అవ్వలేదు. దీంతో నాగచైతన్యతో రంగంలోకి దిగాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికి... తాజాగా రష్మీకను అడగగా..ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.