
లవర్ గౌతమ్ తో రాశిఖన్నా అనగానే రియల్ లైఫ్ లవర్ అనుకునేరు కాదు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "వరల్డ్ ఫెమస్ లవర్". వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే రోజు చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో అన్నట్లుగానే సినిమాలోని నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ డిసెంబర్ 12 నుంచి 15 వరకు రోజుకో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్. చివరిగా రాశిఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్న రాశి "నా లవర్ బాయ్ గౌతమ్ ను ఈ వాలెంటైన్స్ డే నాడు కలవండి" అంటూ షేర్ చేసింది. అంతేకాదు మొదటిసారిగా రాశిఖన్నా స్వయంగా తానే తెలుగులో డబ్బింగ్ చెప్పనుంది. క్రియేటివ్ కమేర్షియల్స్ పతాకంపై కె ఎస్ రామారావ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.