
ఈటీవీ ప్లస్ ఛానెల్ బాగా ఫెమస్ అయిందంటే దానికి ప్రధాన కారణం శ్రీముఖి రవి యాంకర్లగా వ్యవహరించిన పటాస్ షోనే. మల్లెమల్ల ప్రొడక్షన్ లో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన షోస్ లో పటాస్ ఒకటి. అయితే ఇప్పుడు మాత్రం పటాస్ షోకు అంత రేటింగ్ రావట్లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి కారణం శ్రీముఖి, రవి షోను విడటం, డైరెక్టర్ కూడా మారటమేనని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అయితే శ్రీముఖి, రవి మధ్య విబేధాలు వచ్చాయని అందుకే షోను వదిలేసి శ్రీ వెళ్లిపోయిందని వస్తున్న పుకార్లపై యాంకర్ రవి క్లారిటీ ఇచ్చాడు. శ్రీముఖి, నేను ఇప్పటికి మంచి స్నేహితులమే. తన పెర్సనల్ రీజన్ తో షోను వదిలేసి వెళ్ళింది. ఆమె వెళ్లిన కొన్ని రోజులకు డైరెక్టర్ సంతోష్ కూడా వెళ్ళిపోయాడు. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రస్తుతం చేస్తున్న దాన్ని పక్కన పెట్టడం కామన్. నేను కూడా అదే ఆలోచనతో వచ్చేసాను. శ్రీముఖి నా వల్ల వెళ్లిపోయిందనే దాంట్లో ఎంత మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.