
టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు"తో మొదలైంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోలు మల్టీస్టారర్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాస్ మహారాజ కలిసి మల్టీస్టారర్ చేస్తే వర్క్ఔట్ అవుతుందా అనే చర్చ సాగుతోంది. ఈ చర్చ మొదలవ్వడానికి కారణం లేకపోలేదు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "ప్రతిరోజు పండగే" ప్రమోషన్స్ లో తేజ్ మాట్లాడుతూ..."నాకు ఎప్పటి నుంచో మల్టీస్టారర్ చేయాలని ఉంది. వరుణ్ తేజ్ తో కలిసి చేయాలని ఆసక్తి ఉంది. దానికి తగ్గ కధ, డైరెక్టర్ దొరికితే చేసేందుకు నేను రెడీ. అలానే సీనియర్ హీరోల్లో రవితేజతో తెరను పంచుకోవాలని ఉంది. మా మధ్య ఎన్నోసార్లు ఈ డిస్కషన్ వచ్చింది. నీతో కలిసి సినిమా చేయలబ్బాయి అని రవి తేజ అన్నారు" అని తేజ మనసులో మాట బయటపెట్టాడు. మరి వీరి ముచ్చట తీర్చే డైరెక్టర్ దొరుకుతారేమో చూద్దాం!