
హిట్ దర్శకుడు మారుతి దాసరి దర్శకత్వంలో మాస్ మాహారాజ రవితేజ ఒక చిత్రం చేయబోతున్నాడని ఉహాగానాలు చుట్టుముట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇద్దరూ ఈ విషయం గురించి చర్చలు జరిపారని కధ నచ్చడంతో రవితేజ తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. ఈ సినిమాను చిత్రికరించేందుకు యువి క్రియేషన్స్ మేకర్స్ తయారవుతున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. మాస్ మహారాజ అభిమానులు అతనికి ఒక హిట్ ఎప్పుడు పడుతుందోనని ఎదురుచూస్తున్నారు. వరుస ప్లాప్స్ తో కెరియర్ లో డీలా పడ్డ రవితేజ ఇప్పుడు బలమైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ముందు దర్శకుడు రమేష్ వర్మతో రవితేజ ఒప్పుకున్న సినిమా పూర్తి చేసిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.