
బుల్లితెరపై ప్రయోగాత్మకంగా ఎన్నో కామెడీ షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్, పటాస్ హిట్ అయినట్టుగా మరేవి అవ్వలేకపోయాయి. జబర్దస్త్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ను దక్కించుకుంది కామెడీ షో పటాస్. పటాస్ అంతగా హిట్ అవ్వడానికి కారణం యాంకర్ రవి, శ్రీముఖిల కెమిస్ట్రీ ప్రధాన కారణమని చెప్పొచ్చ. కుర్రకారునే టార్గెట్ చేస్తూ కామెడీ పండించేవారు. రవి, శ్రీముఖి కలిసి 1100 ఎపిసోడ్లు చేశారంటే...వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది. కానీ ఉన్నట్టుండి శ్రీముఖి షోను వదిలి వెళ్ళటంతో షోకు పెద్ద లోటు వచ్చిపడింది. బిగ్ బాస్ లోకి వచ్చేందుకు మరిన్ని కారణాల వల్ల ఆమె పటాస్ షోను విడటం జరిగింది. అయితే ఆమె ప్లేస్ లో వర్శిని వచ్చినప్పటికీ రవి, వర్శిని మధ్య ఆ కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో టిఆర్పీలు పడిపోయాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా రవి సైతం షోను వదిలి వెళ్ళాడు. రవి స్థానంలో చలాకీ చంటి వచ్చాడు. రవి పటాస్ షోను విడీ జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ కు వెళ్ళాడు.