
`RX 100`తో హీరోయిన్గా బ్రేక్ సాధించిన పాయల్ రాజ్‌పుత్.. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందిన `RDX లవ్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాలో ఘాటుగా, హాటుగా నటించి యూత్‌ను ఆకట్టుకుంది. అసలు `RDX లవ్` పాయల్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టీజర్ విడుదలైన తర్వాత అందులో రొమాంటిక్ సన్నివేశాలు చూసి అందరూ అవాక్కయ్యారు. అంతలా రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉంది. టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందో.. సినిమా ఇంకెలా ఉంటుందోనని అందరూ అనుకున్నారు. అయితే టీజర్‌కు భిన్నంగా ట్రైలర్ ఉంది. దర్శకుడు శంకర్ భాను ప్రసాద్ ఏదో మెసేజ్‌ను చెప్పాలనుకునేలా సినిమా ఉంటుందని.. అర్థమైంది. పాత్ర పరంగా చూస్తే.. అలివేలు పాత్రలో పాయల్ రాజ్‌పుత్ చక్కగా నటించింది. కండోమ్ లేకుండా శృంగారం చేయడం, గుట్కాలు వాడకం, మద్యపానాన్ని మానిపించడం, ఇలా చాలా విషయాలను దర్శకుడు టచ్ చేశాడు. అయితే ఈ అంశాలన్నింటిలో రొమాంటిక్ పార్ట్... డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోవడంతో సామాన్య ప్రేక్షకుడికి సినిమా కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇక యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలు యూత్‌ను ఆకట్టుకుంటాయి. తేజస్ కంచర్ల పాత్ర , పాయల్ పాత్రకు సపోర్టింగ్ అనే చెప్పాలి. అయితే పాత్రకు తగ్గ ప్రాధాన్యత కూడా ఉంది. ఇక ఆదిత్యమీనన్, నరేష్, నాగినీడు, ఆమని, తులసి.. పాత్రలన్నీ కథానుగుణంగా సాగుతాయి. దర్శకుడు శంకర్ భాను ఓ పాత కథను హీరోయిన్ సెంట్రిక్‌గా చెప్పాలనుకుని ప్రయత్నం చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం, సెకండాఫ్‌లో కొద్దిభాగం రొమాంటిక్ అంటూ తీసిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బందిగానే మారుతాయనడంలో సందేహం లేదు. రధన్ మ్యూజిక్ గొప్పగా లేదు. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం బావుంది. పరుశురాం డైలాగ్స్ అక్కడక్కడా మెరిశాయి. అయితే సినిమా ఆసాంతం ఆకట్టుకునే సన్నివేశాలు లేవు. అర్థనారి అనే ఓ చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకుల మన్ననలు, నంది అవార్డు దక్కించుకున్న శంకర్ భాను ఇలాంటి కథను ఎందుకు చేశాడా? అనిపిస్తుంది. ఎవరిపైనో కోపంతో సినిమా చేశాడా? లేక యూత్ రొమాంటిక్ సీన్స్‌ను చూస్తే చాలనుకుని సినిమా చేశాడా? అనిపిస్తుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం కనపడదు.