
కన్నడ సినిమా గురించి మాట్లాడుకోవడమే తక్కువైన రోజుల్లో సుడిగాలిలా వచ్చి తడాఖా చూపించిన సినిమా "కేజీఎఫ్". ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగరాసిన చిత్రంగా కన్నడ ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. కేవలం కన్నడలోనే కాక అన్ని భాషల్లో దుమ్మురేపింది. కేజీఎఫ్ సాధించిన వసూళ్లకు బాలీవుడ్ సైతం బిత్తరపోయింది. ఆ సినిమాకు అప్పుడు ఇంకాస్త ప్రమోషన్స్ చేసుంటే మరిన్ని సంచనాలు సృష్టించేదని భావించారు ట్రేడ్ విశ్లేషకులు. కేజీఎఫ్2 కూడా ఉందని కేజీఎఫ్ లోనే చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నిల్ ప్రస్తుతం దాన్ని చిత్రకరించే పనిలో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ మొదటి భాగమే అలా ఉంటే ఇక రెండోవ భాగం ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే సినిమాకు సంబందించిన అసలైన ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. డిసెంబర్ 21న సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దద్దరిల్లే సమయం దగ్గరికొచ్చినట్లుగా ఉంది.