
నందమూరి బాలకృష్ణ నటించిన 'నర్తనశాల' సడన్ గా వార్తల్లోకి వచ్చింది. ఇది ఇప్పటి సినిమా కాదు 2004 లో నందమూరి బాలకృష్ణ, దివంగత నటి సౌందర్య, నటుడు శ్రీహరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల కాలేదు. షూటింగ్ దశలో ఉన్నప్పుడు నటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో సినిమా అర్ధతరంగా ఆగిపోయింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు గాను 'నర్తనశాల' మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకొక్కరి పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. ఈనేపధ్యంలో నిన్న 'అర్జునుడి'గా బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ నేడు 'భీముడి'గా దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ద్రవ్పది గా సౌందర్య నటించారు. మరి సౌందర్య ఫస్ట్ లుక్ ను సైతం త్వరలో రిలీజ్ చేయనున్నారు టీం.