
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో చిరు ఫుల్ గడ్డంతో కనిపించనున్నారు. కానీ చిరు తాజా ఫోటో చూస్తే, అయన క్లిన్ షేవ్ లో కనిపిస్తున్నారు. అంటే దాని అర్ధం ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా లేదని తెలుస్తుంది. కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ను చిరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. రకరకాల సినిమాలు చూస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటూ మొత్తానికి జాలిగా గడుపుతున్నారు.