
మెగా సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కొనిదేల నిశ్చితార్థం చైతన్య జోన్నలగడ్డతో కుటుంబ సభ్యుల నడుమ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ సహా మెగా హీరోలందరూ హాజరయ్యారు. వారందరూ ఫోటోలకు పోజులిచ్చి మెగా డాటర్ కు మరపురాని సందర్భంగా మార్చారు. అంతా బాగుంది కానీ, మెగా ఫ్రెమ్ లో నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ కనిపించకపోవటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం హీరో నితిన్ పెళ్లికి వెళ్లే సమయం ఉంది కాని మెగా వారి అమ్మాయి నిశ్చితార్థంకు వచ్చే టైం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏకంగా వారి మధ్య కొన్ని కుటుంబ వివాదాలు ఉండవచ్చునని ఉహాగానాలు చేసే స్థాయికి కూడా వెళ్లారు. ఈ ఉహాగానాలలో ఎంతమాత్రం నిజం లేదు. వాస్తవానికి, పవన్ కళ్యాణ్ గత నెల నుండి చతుర్మాస దీక్షను చేస్తున్నారు. ఈ దీక్షను నాలుగు నెలలు పాటించాల్సి ఉంటుంది. దీక్షను చేస్తున్నప్పుడు, సాయంత్రం 6 తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు. అందుకనే ఎంగేజ్మెంట్ రాత్రి జరిగినందున, పవన్ దీనికి హాజరు కాలేదు. అయితే పవన్ మరుసటి రోజు ఉదయం నాగబాబు ఇంటికి వెళ్లి నిహారిక, చైతన్య జంటను ఆశీర్వదించాడు.