
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సుప్రీం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా డీలా పడకుండా "చిత్రలహరి" తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు అదే జోష్ తో ఫ్యామిలి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ప్రతిరోజు పండగే"లో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర పాటలు, టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బ్రతికే ప్రతిరోజు పండగే అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్పింది బృందం. ఇకపోతే వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానునడంతో డిసెంబర్ 15న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. సాహో తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న ప్రభాస్ ఈ ఈవెంట్ కు వస్తే తమ డార్లింగ్ ను చూసుకోవచ్చు అనే ఆశతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు.