
ప్రభాస్ సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా జాన్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసాడు. ఆ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా స్టోరీకి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ నిన్న 3వ షెడ్యూల్ను ముగించారు. ఈ వార్త దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. "నిన్న 3వ షెడ్యూల్ను పూర్తి చేసామని" ట్వీట్ చేశాడు. డిజైనర్ రవీందర్ రెడ్డిన నిర్మించిన భారీ సెట్లు, సినిమాకే హైలైట్ గా నిల్వనున్నాయి, ఆ సెట్లను సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అద్భుతంగా క్యాప్చర్ చేశారని తెలిపారు రాధాకృష్ణ. రాధా కృష్ణ చెబుతున్న దాని ప్రకారం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ జాన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ మరియు అతని బృందం ఒక చిన్న విరామంలో ఉన్నారట. 10రోజుల బ్రేక్ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ నుండి 4వ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు ప్రభాస్.