
చాక్లెట్ బాయ్ నుంచి మాస్ హీరోగా తనని తాను మార్చుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తాజాగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' మాస్ ప్రేక్షకులను పిచ్చి పిచ్చిగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే ఏ ఫంక్షన్, ఏ తీన్మార్ లోనైనా ఈ సినిమా డైలాగ్లు, పాటలే. క్లాస్ అవతారం నుంచి ఒక్కసారిగా రామ్ మాస్ గా కనిపించిన సినిమా అది. ఇక దాని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రెడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ 'తాడం' కు రీమేక్. కరోనా లాక్డౌన్ లో సినిమా ఓటిటిలో వస్తుందనుకుంటే...లెట్ అయినా పర్లేదు థియేటర్లోనే రిలీజ్ చేయాలనీ దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. దీంతో ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల రూ.14 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది.