
తాజాగా "ఎవరూ" సినిమాలో అందాలు ఆరబోసిన నటి రెజినాకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈమధ్యకాలంలో రెజీనాకు ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టిన విషయం వాస్తవం. అయితే, ఈ హాట్ భామకొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "ఆచార్య" సినిమాలో ఒక ఐటెమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తో ఐటెమ్ సాంగ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా మీడియాతో ముచ్చటించిన రెజినా, మెగాస్టార్ తో సాంగ్ పై తన అనుభవాన్ని పంచుకున్నారు. 'ముందుగా, దీన్ని ఐటెమ్ సాంగ్ అన్నవద్దని, ఇది సెలెబ్రేషన్ సాంగ్ అని ఆమె తెలిపారు'. 'ఆరు రోజుల పాటు రాత్రిళ్ళు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో షూటింగ్ జరిగిందని తెలిపారు'. మరియు, "నేను ఇకపై స్పెషల్ సాంగ్స్ చేయబోనని... ఇది నా మొదటి పాట మరియు చివరిది కూడా. ఇది మెగాస్టార్ పాట కావడంతో నేను దీనికి నో చెప్పలేను" అని తెలిపారు. 'మెగాస్టార్ ఎప్పుడూ సెట్స్‌లో ఉంటూ, చాలా ఆనందంగా ఉంటారని... సెట్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను కలుస్తురాని' అన్నారు.