
ఈటీవీలో ప్రసారమవుతున్న 'ఢీ' అల్టిమేట్ డ్యాన్స్ షో సీజన్ల వారిగా సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ గా మనందరిని అలరిస్తుంది. ఈ షో ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ కు లైఫ్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇదే స్టేజ్ ద్వారా పరిచయమై ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లకు తెలుగు వెండితెర మీద డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. అప్పట్లో ప్రభుదేవా, లారెన్స్ ట్రెండ్ ఎలా సాగిందో ఇప్పుడు శేఖర్ మాస్టర్ హవా అల..సాగుతుంది. అందుకే ఈమధ్యకాలంలో బుల్లితెర మీద కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నారు. అయితే ఢీ షోకు ప్రముఖ జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ ఈ షో ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక 'ఎవరే అతగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియమణి సినిమాలు తగ్గించి బుల్లితెర, ఓటీటీలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఈనేపథ్యంలో ఇమే ఢీ లో మరో జడ్జిగా వ్యహరిస్తున్నారు. దీనికి గాను ప్రియమణి ఒక్క ఎపిసోడ్ కు 60 వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరో జడ్జి అయిన నటి పూర్ణ ఒక్క ఎపిసోడ్ కి 60వేల వేతనం పుచ్చుకుంటున్నారు. ఇక షోను తమ కామెడీ టైమింగ్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్న సుధీర్ ఒక్క ఎపిసోడ్ కి 80వేలు తీసుకుంటుండగా రష్మీ 60వేలు, యాంకర్ ప్రదీప్ 80వేలు ఛార్జ్ చేస్తున్నారు.