
సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, నటి, దర్శకురాలు, నిర్మాత రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కోర్ట్ రూమ్ డ్రామాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్ రీమేక్. ఈ మూవీకి తాత్కాలికంగా ‘లాయర్ సాబ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్‌లో కీలక పాత్ర పోషించడానికి వేణు శ్రీరామ్, రేణు దేశాయ్‌ను సంప్రదించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసలు హిందీ వర్షన్ చూసి ఉంటే, హీరోయిన్ పాత్ర కన్నా అమితాబ్ భచన్ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ.అయితే తమిళంలో ఈ చిత్రంను రీమేక్ చేసినప్పుడు, గర్భధారణ సమయంలో మరణిస్తున్న ఓ ఇల్లాలి పాత్రను సృష్టించారు. తమిళ రీమేక్ లో సృష్టించబడ్డ ఆ పాత్రలో విద్యా బాలన్ నటించారు. ఇప్పుడు తెలుగు రీమేక్ మేకర్స్ కూడా ఆ పాత్రను ఉంచాలని భావించి ఆ పాత్ర కోసం రేణు దేశాయ్ ను సంప్రదించిన్నట్లు తెలుస్తోంది.