
“పవర్‌స్టార్” విడుదలైన రెండు రోజులకే, రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీకి మరోసారి దెబ్బ పడింది. మాజీ స్టార్ దర్శకుడు రిలీజ్ చేసిన ఈ షార్ట్ ఫిలింలో జబర్దాస్త్ రకం కామెడీ తప్ప అసలు కంటెంట్ లేకపోవడంతో, దర్శకుడు మరికొన్ని వివాదాలను లాగడానికి ప్రయతినిస్తున్నాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణతో ముడిపడిన షూటింగ్ సంఘటనను ‘ఆ రాత్రి ఎమ్ జరిగింది’ పేరుతో సినిమా చేస్తుండగా, ఇప్పుడు వర్మ ఉదయ్ కిరణ్ కథపై కూడా దృష్టి సారించినట్లు నివేదికలు వస్తున్నాయి. అతను ఆత్మహత్య ఎపిసోడ్‌కు ట్విస్ట్ ఇస్తూ తీస్తాడా లేదా నటుడి వివాహ ఎపిసోడ్ పై దృష్టి పెడతాడో తెలియదు. కాని అతను ఈ చిత్రానికి ఇప్పటికే "హృదయ్ కిరణ్" అనే టైటిల్ పెట్టేసాడు.
ఒక వారంలో స్క్రిప్ట్‌ను రాయడం మరియు ఆ చిత్రాన్ని కేవలం 2-3 రోజుల వ్యవధిలో చిత్రీకరించడం, డబ్బుల కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్లలో విడుదల చేయడం ఈ రోజుల్లో వర్మకు రొటీన్ గా మారింది.