
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఓ జాతీయ చానెల్ తో మాట్లాడుతూ సుశాంత్ కు మాజీ ప్రియురాలు అంకితా లోఖండేకు మాటలు కలిశాయని.. వారిద్దరూ మాట్లాడుకున్నారని ఆరోపించారు. దీనిపై తాజాగా మాజీ ప్రియురాలు అంకితా లోఖండే స్పందించారు. సుశాంత్ తో విడిపోయిన తర్వాత తానెప్పుడు మళ్లీ అతడితో మాట్లాడలేదని అంకిత స్పష్టం చేశారు. తనకు సుశాంత్ ఫ్లాట్ కొనిచ్చాడన్న ఆరోపణలు అవాస్తవమని.. విడిపోయాక తాము ‘మణికర్ణిక’ సినిమా విడుదల అప్పుడే సోషల్ మీడియాలో పలకరించుకున్నామని.. ఫోన్ లోనూ మాట్లాడలేదని వివరణ ఇచ్చింది.