
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అని తెలడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. వాళ్ళు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రార్ధనలు చేస్తున్నారు. అయితే ఈ వార్త బయటికి వచ్చిన నిమిషం నుండి ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త రాగానే, బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్, అతని తల్లి నీతూ కపూర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలంటికి రిథిమా కపూర్ చెక్ పెట్టింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, అనవసరైన రూమర్లను పుట్టించకండి అంటూ పుకార్లను కొట్టిపడేసింది.