
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయాల్లో అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం కామనే. టీడీపీ, జనసేన పార్టీలు దానికి అతీతమేమి కాదు. సందు దొరికిన ప్రతిసారి జగన్ను, ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేన పార్టీ ప్రభుత్వంపై పలు విషయాల్లో ఒత్తిడి తెచ్చే దిశగా అడుగులేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన ఇసుక కొరత విషయంలో జనసేనాని లాంగ్ మార్చ్ అంటూ, తెలుగు భాషను కాపాడలంటూ పోరాటాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. వైసీపీ కూడా దానికి తగ్గ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజా మీడియా సామావేశంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ చిన్నమెదడు చిట్లిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ 6 నెలల పాలన చూసి ప్రజలు సై సైరా నరసింహారెడ్డి అంటున్నారని కొనియాడారు. మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.