
'ప్రేమమ్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత తనకు సెట్ అయ్యే కధలను ఎంచుకుంటూ మంచి స్టార్డంను దక్కించుకుంది. ఆమె డ్యాన్స్ లో ఉండే గ్రెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కళ్ళు కూడా డ్యాన్స్ చేస్తాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే, సౌత్ స్టార్ ధనుష్- సాయి పల్లవి కలిసి నటించిన 'మారి2' లోని 'రౌడీ పిల్ల' సాంగ్ రిలీజ్ అయిన రోజు నుంచి యూట్యూబ్ లో రాకెట్ లా జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అరుదైన రికార్డులు దక్కించుకుంటుంది. తాజాగా ఈ పాటకు యూట్యూబ్ లో 900 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది బాలీవుడ్ వీడియోలను దాటుకొని ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కామన్ మ్యాన్ నుంచి టిక్ టాక్ స్టార్లు ఈ పాటకు డబ్ స్మాష్లు చేసారు...చేస్తూనే ఉన్నారు.