
టాలీవుడ్ స్థాయిని 'బాహుబలి' సినిమాతో అమాంతం పెంచిన దర్శ దిగ్గజం రాజమౌళి తదుపరి సినిమా 'ఆర్ఆర్ఆర్' ను ప్రకటించినప్పటి నుంచి సంచలనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లోని అగ్ర నటులైన ఎన్టీఆర్. రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతుండటంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన RRR టీం తాజాగా షూటింగ్ ను ప్రారంభించింది.
ఈమేరకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ పాత్ర కొమరంభీం టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇకపోతే ఈ చిత్ర నిర్మాతలు డిజిటల్, థియరిటికల్ రైట్స్ ను సుమారు రూ. 200 కోట్లు కు అమ్మినట్లు సమాచారం. ఇది కాకుండా సాటిలైట్ రైట్స్ ను స్టార్ మా భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.