
కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా మంది చిత్రనిర్మాతలు తమ షూట్ ను తిరిగి ప్రారంభించారు. అందుకే టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఈ రోజు నుండి ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కిక్ స్టార్ట్ చేయబోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భద్రతా మార్గదర్శకాల వల్ల ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగింది. అయినా కూడా చాలా మంది హీరోలు తమ రెమ్యునరేషన్ ను తగ్గించడానికి సిద్ధంగా లేరు. కాని వారిలో కొంతమంది మాత్రం నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకుని తమ రెమ్యునరేషన్లో కోతలు విదించుకుంటున్నారు. కరోనావైరస్ మహమ్మారి పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న నటులు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్, వారు ఆర్ఆర్ఆర్ కు తీసుకునే రెమ్యునరేషన్ ను తగ్గించి తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. యావత్ సౌత్ చలనచిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు జూ. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వారు ముందుగా అంగీకరించిన రెమ్యునరేషన్ లో 30% శాతం తగ్గించుకొని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. కరోనా దెబ్బ నిర్మాతలపై కూడా భారీగా పడటంతో ఇది అర్ధం చేసుకుని ఇద్దరు స్టార్ హీరోలు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.