
కరోనా లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలను పాటుస్తూ ఆర్ఆర్ఆర్ టీం చిత్ర షూటింగ్ ప్రారంభించి కొమరం భీం టీజర్ అక్టోబర్ 22న వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో రామరాజు ఫర్ భీం టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టీజర్ విషయంలో తారక్ అభిమానిలు పెద్ద పెద్ద ప్లానింగులు మొదలెట్టేశారు. ముఖ్యంగా రాజమౌళి ఈ టీజర్ ను ఎలా కట్ చేస్తారు అనేదానిపైనే ఇప్పుడు అందరి ఆసక్తి నెలకుంది. ఈ రాబోయే టీజర్ లో అల్లూరిగా చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే మరో పక్క ఎలివేషన్స్ ను కూడా గట్టిగా దట్టిస్తారని కూడా తెలుసు. కానీ తారక్ లుక్ పరంగా మాత్రం జక్కన ఊహించని విధంగా చెక్కినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ లో భీం గా తారక్ తలపాగాతో తప్పని సరి కనిపిస్తాడని టాక్. ఇప్పటికే పలు లిక్స్ తో చాలా వరకు ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడనే దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ఆమధ్య షూటింగ్ లో ఒక ఫోటో లీక్ అవ్వగా మొన్నీమధ్య జక్కన్న అండ్ టీం విడుదల చేసిన వీడియోలో బులెట్ మీద చేతికి కడియం పెట్టుకొని ఉండటం చూశాము. దీంతో ఎన్టీఆర్ టీజర్ లో కూడా ఆ బులెట్ పై వచ్చే షాట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. మరి రామరాజు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 22 వరకు ఆగాల్సిందే.