
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీలోనే ఇద్దరు స్టార్ హీరోలతో 'ఆర్ఆర్ఆర్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా లాక్డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించిన టీం అన్నట్లుగానే జూ.ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర 'కొమరం భీమ్' టీజర్ ను నేడు రిలీజ్ చేసారు. ముందు నుంచే సినిమాలో రామ్ చరణ్ పాత్రను నిప్పుతో, ఎన్టీఆర్ పాత్రను నీరుతో పిలుస్తున్నారని తెలుసు. అయితే నేడు రిలీజ్ చేసిన టీజర్ లో కొమరం భీమ్ గురించి సీతా రామారాజు నీరుతో పోలుస్తూ చెప్పిన డైలాగ్లు ఎంతో బలంగా ఉన్నాయి. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందోనని కళ్ళకు కట్టినట్లు చుపుపించారు జక్కన్న. టీజర్ లోని ప్రతి షాట్, ప్రతి మాట వెనుక ఎంతో అర్ధం ఉంది. టీజరే ఈ రేంజ్ లో కట్ చేస్తే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించొచ్చు.