అక్టోబర్ 22న ఎన్టీఆర్ ‘కొమరం భీం’ టీజర్…..ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన ఈ వీడియో చూస్తే మతిపోతుంది
3 years ago 1 min read

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' పై ఎన్ని అంచనాలు నెలకున్నాయో మాటల్లో చెప్పలేము. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్నా రామ్ చరణ్ పుట్టినరోజు నాడు అల్లూరి సీతారామారాజును పరిచయం చేస్తూ టీజర్ వదిలింది టీం. అది చూసినవారంతా ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర కొమరం భీం టీజ ర్కోస్మ్ కోట్ల కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వేసిన బ్రేక్ తర్వాత షూట్ ను తిరిగి ప్రారంభించిన చిత్ర యూనిట్ కొమరం భీం టీజర్ అక్టోబర్ 22న వస్తుందని తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేసారు. అందులో రామ్ చరణ్ గుర్రపుస్వారీ, ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ వీడియోతోనే రోమాలు నిక్కపొడిచేలా చేసిన జక్కన్న ఇక కొమరం భీం టీజర్ ను ఏ రేంజ్ లో తయారుచేస్తాడో ఉహించడానికే కష్టంగా ఉంది.