
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' కోసం కేవలం తెలుగు ప్రజలే కాదు బాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత షూటింగ్ ను షెరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. నిన్న బాలీవుడ్ నటి అలియా భట్ కూడా సెట్స్ కు చేరటంతో షూటింగ్ మరింత వేగం అందుకోనుంది. అయితే అలియా వచ్చిన క్షణం నుంచి ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. ఆమెతో పాటు వచ్చిన 10 మంది స్టాఫ్...ఒక హెయిర్ స్టైలిస్ట్, అసిస్టెంట్, 4 బౌన్సర్లు, డ్రైవర్, మ్యానేజర్, మేకప్ ఆర్టిస్ట్ ఇలా వీరందరికి రోజు పేయిమెంట్ చేయాలనీ అలానే స్టార్ హోటల్ లో వసతి, వాళ్లకు కావాల్సిన ఆహారం సమకూర్చాలని అలియా ముందుగానే చెప్పిందట. దీంతో అలియా స్టాఫ్ కి ఒక్కొక్కరికి రోజుకు లక్ష అవుతుందని సమాచారం. మరి ఇంత ఖర్చు పెట్టిస్తున్న అలియా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.