
రాజమౌళి ’ఆర్ఆర్ఆర్', ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టనుంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని, ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే అర్ధం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 200 కోట్ల రూపాయల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రేడ్ సర్కిల్స్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, కేవలం జంట తెలుగు రాష్ట్రాలకే ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ తెరిచి ఉంది. దీంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకూ దక్కని అత్యధిక ధర. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్త బిజినెస్ 'బాహుబలి 2' కు సమానంగా ఉంటుందని తెలుస్తోంది.