
బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. టాలీవుడ్ ఇద్దరు బడా హీరోలతో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా కరోనా కారణంగా మరింత వెనక్కి వెళ్ళింది. అయితే తాజగా కరోనా నిబంధనలు సడలించడంతో హైదరాబాద్ లో షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ప్యాక్ అప్ చెప్పి మహాబలేశ్వరంకి చెక్కేశారు. అక్కడ కొన్ని క్రేన్ షాట్లు, డ్రోన్ ఉపయోగించి ప్రకృతికి సంబంధించిన షాట్లు తీస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.