
ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విధుల్లోకి చేరకుండా ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం వ్యతిరేకించేసారికి నిరసనలు మరింత ఉద్రిక్తం చేశారు. జేఏసీ, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తామనడం వెనుక పెద్ద కుట్రే ఉందని....ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని జేఏసీ ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లోకి చేరని కారణంగా కోర్టుకు వెళ్ళింది. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించి విరుచుకుపడ్డారు. కానీ కోర్టు కూడా ప్రభుత్వానికే సానుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక చేసేదేంలేకా దిగొచ్చి బేషరతుగా విధుల్లోకి చేరతామని కార్మికులు అన్నప్పటికి మీ ఇష్టానుసారం ఎలా చేస్తారని కోర్టు మందలించింది. దీంతో కొంతమంది కార్మికులు కేసీఆర్ ను కాకపట్టె పనిలో పడ్డారు. కేసీఆర్ మనసు నొప్పించి ఉంటే.. పెద్ద మనసుతో తమను మన్నించాలని ముషీరాబాద్ ఆర్టీసీ కార్మికులు తాజాగా విజ్ఞప్తి చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.