
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ సినిమాలో మొదటిసారి మహేష్ సరసన రష్మీక మందన్న నటిస్తుంది. అయితే చిత్ర బృందం ప్రోమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు, మైండ్ బ్లాక్, సూర్యుడు చంద్రుడు అనే మూడు పాటలను రిలీజ్ చేసింది. ఆ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక అన్నట్టుగా వచ్చే సోమవారం "హి ఈజ్ సో క్యూట్" అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కాస్త భిన్నంగా ప్రకటించింది. హీరోయిన్ రష్మీక ఆ పాట ప్రోమోకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోను టిక్ టాక్ ద్వారా రిలీజ్ చేశారు. పూర్తి పాట వచ్చే సోమవారం రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మీక వేసిన స్టెప్పులకు మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలిజ్ కానుంది.