
తన చిత్రాలకు సరైన డైరెక్టర్ ను వెతకడం ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి యొక్క బలం. తాజాగా చిరు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. "లూసిఫెర్" చిత్రం యొక్క తెలుగు రీమేక్ ను తెరకెక్కించడానికి దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు, మొదట దర్శకుడు వివి వినాయక్ తో ముందుకు సాగాలని అనుకున్నా, చిరు దర్శకుడు విషయంలో అంత సులభంగా ముందుకు వెళ్ళేటట్లు కనిపియట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు అంతా అనుకున్నట్లు జరిగితే ఆసక్తికరమైన కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. 'సాహో' చూసిన తరువాత, లూసిఫెర్ రీమేక్‌ను రూపొందించడానికి దర్శకుడు సుజిత్ రెడ్డి ఉత్తమ ఎంపిక అని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నట్లు చెబుతతున్నారు. సాహో బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయినప్పటికీ, డైరెక్టర్ సినిమాను తెరకెక్కించిన విధానం నచ్చడంతో సుజిత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఇంతకీ ఏ డైరెక్టర్ ఫైనలైజ్ అవుతారో చూడాలి.