
గ్లామర్ ఫీల్డ్ లో రోజుకో మొహం కనిపిస్తుందన్న మాట వాస్తవం. నిత్యం తమ అందం, అకృత్యంపై ఫోకస్ పెడుతూనే ఉంటే కానీ సినీ ఇండస్ట్రీలో గుర్తించడం కష్టం. కానీ అలాంటి గ్లామర్ ఫీల్డ్ లో ఎటువంటి స్కిన్ షో చెయ్యకుండా బోల్డ్ పాత్రల్లో నటించకుండా కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉండే కధలను ఎంచుకుంటూ టాప్ హీరోల సరసన నటిస్తూ మాలీవుడ్ లోనే కాక టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా దూసుకుపోతుంది సాయి పల్లవి. అయితే తాను ఆమధ్య కోట్ల రెమ్యునరేషన్ అఫర్ వచ్చినా ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ను తిరస్కరించిందని జోరుగా వార్తలు వినిపించాయి. తాజాగా దానిపై నోరు విప్పింది సాయి పల్లవి.....'నేను మొటిమలతో ఎంతో ఇబ్బంది పడ్డాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదని కాదు. కానీ ప్రేమమ్ సినిమాలో ప్రేక్షకులు నన్ను నన్నుగా ఇష్టపడ్డారు. అందుకే మిగితా అమ్మాయిలకు నేను ఉదాహరణగా నిలవాలి అనుకున్నాను. ముఖ్యంగా మా చెల్లికి, తను కూడా ఫెయిర్ నెస్ కోసం ఇష్టం లేని తిండి తింటూ చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే నాకు 2 కోట్ల రెమ్యునరేషన్ అఫర్ చేసినా ఆ ఫెయిర్ నెస్ యాడ్ తిరస్కరించానని' స్పష్టం చేసింది.