
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి మళ్ళీ తిరిగి రానున్నారు. దింతో దర్శక నిర్మాతలు ఆయనతో సినిమా చెయ్యడానికి క్యూ కడుతున్నారు. పవన్ కూడా ఇప్పటికే రెండు మూడు చిత్రాలకు సైన్ చేయడం జరిగింది. అయితే పవన్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఎలాగైతే ఎదురుచూస్తారో అతనితో ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తే చాలని అనుకునే నటినటులు ఎంతోమంది. అలాంటిది ఓ ముద్దుగుమ్మకు మంచి రోల్ ఆఫర్ చేసిన నో చెప్పిందట. ఆమె మరెవరో కాదు సాయి పల్లవి. మలయాళం హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశాయమ్' ను తెలుగులో పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక రోల్ చేయమని సాయి పల్లవిని అడగగా అందుకు ఆమె తిరస్కరించిందట. అయితే స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న ఆమెకు చిన్న రోల్ ఆఫర్ చేయటంతో సాయి పల్లవి నో చెప్పినట్లు తెలుస్తోంది.
Tags: #pawankalyan #PsPk #SaiPallavi