
హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి క్రేజ్ తెలుగు ఇండస్ట్రీలో 'ఫిదా' సినిమాతో బాగా పెరిగింది. ఆమె డ్యాన్స్ చేసిందంటే నోరు ఎల్లబెట్టి చూడాల్సిందే. ఆమె గ్రెస్, స్టైల్ వల్ల యూట్యూబ్ లో ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ నెలకుంటున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవి ఐటెం సాంగ్స్ కు కంపోజ్ చేయనుంది. వరుణ్ తేజ్ రిక్వెస్ట్ మేరకు 'గద్దలకొండ గణేష్' ఐటెం సాంగ్ కు సాయి పల్లవి కంపోజ్ చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ దిల్ రాజు అతని సినిమాలో ఐటెం సాంగ్ కు కంపోజ్ చేయమని సాయి పల్లవిని అడిగినట్లు తెలుస్తుంది. దిల్ రాజుతో 'ఫిదా' సినిమా చేయటంతో తన ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ కు నో చెప్పలేక సాంగ్ కంపోజ్ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.