
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న చిత్రం 'ఆదిపురుష్' టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రామాయణం ఆధారంగా రూపొందనున్న భారీ బడ్జెట్ డ్రామాను 'తన్హాజీ' ఫేం ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్నారు. అన్నట్టుగానే ఆదిపురుష్లో ప్రధాన విలన్ పాత్రను పోషించే నటుడి పేరును బృందం వెల్లడించింది. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణుడిగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా '7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే తెలివైన రాక్షసుడు ఉండేవాడు' అంటూ చిత్ర బృందం విలన్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తన్హాజి చిత్రంలో ఓం రౌత్, సైఫ్ అలీ ఖాన్ కలిసి పని చేశారు. ఆ సినిమాలో సైఫ్ అద్భుతమైన నటన చూసి ఓ రౌత్ ఆదిపురుష్ లో రావణుడిగా సైఫ్ సరిగ్గా సరిపోతాడాని భావించి అతన్నే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.