
డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి భానుమతిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ తోనే మయిమరిపించే ఈ హైబ్రిడ్ పిల్ల ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తుంది. ఇది కాక రానా హీరోగా తెరకెక్కుతున్న 'విరాట పర్వం' లో నక్స్లైట్ గా కనిపించనుంది. అయితే, నక్స్లైట్ పాత్రలో సాయి పల్లవిని చూసిన మెగాస్టార్ చిరంజీవికు నచ్చడంతో 'ఆచార్య' టీం నక్స్లైట్ గా ఒక స్పెషల్ రోల్ ను చేయమని సాయి పల్లవిను అడగగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఒకే రకమైన పాత్రలు ఒకే టైంలో చేయడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం.