
కలికాలం అంటే ఏంటో అనుకున్నాం గాని మాస్టారు, చాలా మార్పులు, ఎన్నో అభివృద్దులు. ఏదేమైనా అంతా మన మంచికే అనుకోవాలేమో. ఇంతకీ సంగతేంటి అంటే...ఒకప్పుడు పెళ్ళికి మాత్రమే ముహుర్తాలు కానీ ఇప్పుడు పిల్లలు పుట్టడానికి కూడా ఫలానా సంవత్సరం, నెల అని ముహుర్తాలు పెట్టుకుంటున్నారు. దీన్ని టాలీవుడ్ లో సుమారు 10 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత మరోసారి నిరూపించారు. వరుస సినిమాలు చేసుకుంటూపోతున్న ఈ అమ్ముడిని పిల్లలు ఎప్పుడు అని అడిగితే 'నేను చై ఒక టైం అనుకున్నాము. అప్పుడే పిల్లలు పుడతారు. అంతవరకు ప్రొఫెషనల్ లైఫ్ మీదనే దృష్టి. పిల్లలు పుడితే నా ప్రపంచం వాళ్లే అవుతారు. నేను వాళ్ళతోనే ఉంటాను' అని చాల క్లారిటీగా క్లియర్ గా చెప్పేసింది.