
సమంత అక్కినేని మరియు నందిని రెడ్డి తమ రెండవ ప్రాజెక్ట్ గా కొరియన్ డ్రామా 'మిస్ గ్రానీ' కు రీమేక్ 'ఓ బేబీ' తెరకెక్కింది. 2019లో విడుదలైన ఓ బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సమంత ఇప్పుడు నందిని రెడ్డితో మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారట. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మొదట నాగచైతన్యతో సినిమా చేయాలని భావించి చైను సంప్రదించగా మజిలీ హీరో అందుకు ఒప్పుకోలేదట కానీ సమంత నుంచి నందినికు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ హారర్ డ్రామా కథకు నందిని రెడ్డిని రికమెండ్ చేసింది కూడా సమంతానేనట. సోనీ పిక్చర్స్ సంస్థలో సమంత ప్రధాన పాత్రలో నందిని దర్శకత్వంలో ఈ హారర్ డ్రామా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక సమంత ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ఏ సినిమాలోను నటిస్తున్నట్లు అధికారిక ప్రకటనైతే లేదు కానీ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో డిజిటల్ దునియాలో అడుగుపెట్టబోతుంది.