
ఇటీవలే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ- పూజా హెగ్డేలతో మంచి హిట్ కొట్టారు. పూజ హెగ్డేతో త్రివిక్రమ్ ఇప్పటికే 'అరవింద సమేత' మరియు 'అల..వైకుంఠపురములో' సినిమాలు తీసి హిట్లు కొట్టారు. అందుకే ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టాలని ఇప్పుడు #ఎన్టీఆర్30 లో కూడా పూజని భాగం చేశారని పుకారు వచ్చింది. అయితే దర్శకుడు మరో హీరోయిన్ డేట్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు రావడంతో ఈ టాపిక్ కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అప్పట్లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన వరుస మూడు చిత్రాల కోసం సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసుకోని అందరినీ ఆశ్చర్యపరిచారు. 'అత్తారింటికి దారేది', 'S/o సత్యమూర్తి' మరియు 'అ..ఆ' తో వరుసగా మూడు చిత్రాల్లో ఆమె ఆసక్తికరమైన పాత్రలను పోషించింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే తదుపరి చిత్రంలో సమంతను కీలక పాత్ర కోసం తీసుకోవాలని త్రివిక్రమ్ కోరుకుంటున్నట్లు తాజా చర్చ. మరి దీనికి సమంత అంగీకరిస్తుందో లేదో చూడాలి.