
ఇటీవలే చిత్ర పరిశ్రమలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి, ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నను తీసుకున్నారని జోరుగా వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ పదర్శకత్వంలో రాబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసారు మేకర్స్. ఎన్టీఆర్30 యొక్క రెగ్యులర్ షూట్ వేసవి చివరి నుండి ప్రారంభమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించినున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా వచ్చే ఏడాది వేసవిలో తెరపైకి వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ నుండి కన్నడ అమ్మాయి రష్మిక మందన్న స్థానంలో సమంత అక్కినేని వచ్చారు. సమంత ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’, ‘s/o సత్యమూర్తి’, ‘అ.. ఆ’ చిత్రాల్లో నటించారు. అలాగే ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో నాలుగు చిత్రాలలో జాతకట్టింది. మరి ఎన్టీఆర్30 లో సమంతను ఎంపిక చేసుకోవడంపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.