
అక్కినేని ఇంటి కోడలు సమంత మొన్నటి వరకు సినిమాలతో బిజీగా ఉండి ఇప్పుడు వెబ్ సిరీస్ పై ఫోక్స్ పెట్టింది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కధల ఎంపికలో సామ్ స్టైల్ మారింది. ఇక నిన్నటికి నిన్న మామ గారు అప్పగించిన బాధ్యతను స్వీకరించి బిగ్ బాస్ స్టేజ్ పై హోస్ట్ గా కనిపించి అందరిని మెప్పించింది. మామకు తగ్గ కోడలిగా షెబాష్ అనిపించుకుంది. ఈమధ్యనే బిజినెస్ రంగంలోకి దిగిన సామ్ 'సఖీ' పేరుతో ఫ్యాషన్ డిజైనర్ వెర్ ను ప్రారంభించింది. ఇది పక్కన పెడితే మొన్న అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన సామ్ ను ఒక అభిమాని 'మీకు శృగారం చేయటం ఇష్టమా? లేదా ఫుడ్ ఇష్టమా?' అని అడిగిన ప్రశ్నకు సామ్ బదులిస్తూ 'నాకు ఆహారం కన్నా సెక్స్ అంటేనే ఇష్టమని' చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tags: #Akkineni #Cinecolorz #Samantha