
ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ములుపురి నిర్మిస్తున్న "అశ్వద్ధామ" వచ్చే నెల 30న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రేపు టీజర్ విడుదల చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సమంత అక్కినేని ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రేపు ఉదయం 11:07 నిమిషాలకు సమంత చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలావుండగా అశ్వద్ధామ కోసం నాగశౌర్య తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ డెవలెప్ చేసి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. వైజాగ్ నేపథ్యంలో అన్యాయాలను ప్రశ్నించే యువకుడిగా నాగ శౌర్య రోల్ ఉంటుందిట. నాగశౌర్యకు జంటగా మెహరిన్ నటిస్తుంది.