
కరోనా అందరిని ఒక 6 నెలల పాటు ఇంటికే అంకితం చేసింది. అయితే గత రెండు నెలలుగా కొంతవరకు బిజినెస్ లు, షూటింగ్ లు, మిగితా రంగాల్లో పనులు మొదలయ్యి యధావిధిగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే సెలెబ్రిటీలు కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చి షూటింగ్లలో బిజీ అయిపోయారు. అంతేకాదు ట్రిప్లు కూడా వేస్తున్నారు. జనసంచారం తక్కువగా ఉండే చోట్లకు ఎగిరిపోతున్నారు. మనం పక్కనున్న వాటర్ ఫాల్స్ కో లేదా గోవాకో బడ్జెట్ వేసుకుంటే సెలెబ్రిటీలు విదేశాలకు వేసుకుంటారు. గత కొన్నిరోజులుగా సినీ తారలు ఒకరి తరవాత ఒకరు మాల్దీవులకు వెళ్తున్నారు. మెహ్రిన్, రకుల్, తాప్సి, కాజల్ ఇప్పుడేమో సమంత. రెండు రోజుల క్రితం భర్త నాగచైతన్యతో కలిసి సమంత అక్కినేని మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఇద్దరు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో తెలియాలంటే సమంత పెట్టె ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది.