
సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, సమంత అక్కినేని తన రాబోయే చిత్రం "కాతు వాకులా రేండు కాదల్" నుండి తప్పుకుందని తెలుస్తోంది. తల్లి కాబోతుండడమే కారణమని, విజయ్ సేతుపతి మరియు నయనతారతో సామ్ వివరించినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివన్, "కాతు వాకులా రేండు కాదల్" గురించి అధికారిక ప్రకటన చేసి, ఈ చిత్రంలో సమంత అక్కినేని, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సమంత అక్కినేని కాతు వాకులా రేండు కాదల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఓ బేబీ నటి ఇటీవల విఘ్నేష్ శివన్‌ను చెన్నైలోని తన ఆఫీస్ లో కలుసుకుని, కాతు వాకులా రేండు కాదల్ చిత్రంలో భాగం కాలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఈ పాత్రకు సెట్ అయ్యే నటీమణుల పేర్లను కూడా ఆమె మేకర్స్ కు సూచించినట్లు వినికిడి.