
సమంత 2.0 ఏంటి అనుకుంటున్నారా ? అసలు విషయం ఏంటంటే...ముందు నుంచి తెలిసిన విషయమే, సమంత ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో కనిపించనుందని. అందుకే దాన్ని సమంత 2.0గా పిలుస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా సమంతానే చేసింది. సోషల్ మీడియాలో ది ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ పూర్తయినట్లు సెట్స్ నుండి తన పిక్ ఒకటి షేర్ చేసింది. ఆ ఫోటోలో బాబ్ హెయిర్ కట్ తో, బీచ్ దగ్గర నిలబడింది సామ్. సమంత బీచ్ వైపు చూస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ "ది ఫ్యామిలీ మ్యాన్ సిజన్ 2 సెట్లలో ప్రతిరోజు మరపురానిది. నన్ను నమ్మి, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రలోకి ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర. నిన్నటిలా అనిపిస్తుంది ". అలానే ది ఫ్యామిలీ మ్యాన్ లో అవకాశం ఇచ్చినందుకు రాజ్ నిడిమోరుకు కృష్ణ డికె కు కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో సమంత టెర్రరిస్ట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.