
బాలయ్య దెబ్బకు సమంత వెనక్కి తగ్గేలా ఉందే?
అక్కినేని సమంత ఒక రెండేళ్ల నుంచి సినిమాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. పెళ్లి తర్వాత కెరియర్ ముగుస్తుంది... సినిమాలు పెద్దగా రావు అని అనుకున్న వారి నోళ్లు ముయిస్తూ వరసగా హిట్లు మీద హిట్లు కొడుతుంది. లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నపటికి కథలు బాగుంటే అందులో ముఖ్యంగా తన పాత్ర బాగుంటే రొమాన్స్ చేసేందుకు కూడా సై అంటుంది. ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన '96' నచ్చడంతో తెలుగు రీమేక్ లో శర్వానంద్ తో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వసూళ్ల వర్షం కూడా కురిపించింది. దీంతో దిల్ రాజు తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. నవంబర్ లో విడుదల చేద్దామని సన్నాహాలు చేసినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇలోపే బడా స్టార్లు డీసెంబ్ లో వస్తూ ఝలక్ ఇచ్చారు. డిసెంబర్ 20న బాలయ్య రూలర్ అంటూ వస్తున్నాడు. అదేరోజు సాయి ధరమ్ తేజ్ కూడా ప్రతిరోజూ పండగే అంటున్నాడు. ఈ రెండు సినిమాలు అలా వచ్చాయో లేదో వారం గ్యాప్ తీసుకుని డిసెంబర్ 25న రవితేజ డిస్కో రాజా అంటున్నాడు. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు రావడంతో సమంత అక్కినేని సినిమా సైలెంట్‌గా సైడ్ అయిపోయింది.