
బిగ్ బాస్ సీజన్ 4 గత రెండు వారాలుగా నత్తనడక నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకపక్క కుమార్ సాయి ఎలిమినేషన్ తో షోపై విమర్శలు రాగా ఈ వారమైతే మరి చప్పగా సాగింది. దింతో యాజమాన్యం నడుము బిగించింది. షోను రకెత్తికట్టించేందుకు అన్ని విధాలుగా స్టేజ్ ను సెట్ చేశారు. అర్థం కాలేదా? రేపు దసరా అంతేకాకుండా వీకెండ్ దింతో యాజమాన్యం గట్టిగా ప్లాన్ చేశారు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లగా అతన్నీ భర్తీ చేస్తూ సమంత అక్కినేని రాబోతున్నారు. ఇది ఎవరు ఉహించనిదే, మొన్నటి వరకు రమ్యకృష్ణ, రోజా పేర్లు వినిపించగా ఒక్కసారిగా మామ ప్లేస్ లో కోడలు రాబోతుందని తెలియడంతో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్న సమంత బిగ్ బాస్ స్టేజ్ ను, ఆ ఇంటి సభ్యులను ఎలా మ్యానేజ్ చేస్తుందో ఆసక్తిగా మారింది. అంతేకాదు సింగర్ గీతామధురి, శ్రావణి భార్గవిలు వచ్చి పాటలు పాడి సమంతను స్టేజ్ పైకి ఆహ్వానించినట్లు సమాచారం. మొత్తంగా దసరా ఎపిసోడ్ ఎంతో ఆహ్లాదకరంగా మారబోతుంది.