
పాపులర్ దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా సమంత ప్రధాన పాత్రలో "ఓ బేబీ!" అనే ఫాంటసీ డ్రామాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా సమంత నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం కొరియన్ సినిమా మిస్ గ్రానికి రీమేక్ అయినప్పటికీ, నందిని రెడ్డి చక్కగా హ్యాండిల్ చేసిందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు సామ్ తరువాత, నందిని తన తదుపరి చిత్రం కోసం సామ్ భర్త నాగచైతన్య ప్రధాన పాత్రలో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, నందిని రెడ్డి యొక్క తదుపరి చిత్రంను నిర్మించనున్న స్వాప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు తమ ప్రాజెక్ట్ కోసం చైతన్యను ఎంపిక చేసుకున్నారు. నందిని ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నందున, చై-నందిని రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కొన్ని వారాల్లో రానుంది.